వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజా పార్టీ..ప్రజలకోసమే మా పోరాటం
1 min readప్రజల పక్షాన పోరాటం చేయడంలో వెనుకడుగు వేయదు
శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలోని కృష్ణానగర్ నందుగల శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ నందు వైఎస్ఆర్సిపి జిల్లా నూతన కార్యవర్గ సభ్యుల చేత పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంనకు వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు శ్రీ సతీష్ రెడ్డి మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కే రాంభూపాల్ రెడ్డి శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి మాజీ కేడీడీసీ బ్యాంక్ ఛైర్పర్సన్ ఎస్ వి విజయ మనోహరి హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి ని రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఏకమై కుట్రతో ఓడించారని విమర్శించారు ఇదే సందర్భంలో రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం, జీతాలు పెంచుతామని చెప్పినా వాలంటీర్లకు ఇంతవరకు తీసుకోకపోవడం వైఎస్ఆర్సిపి ప్రజాపక్షం ప్రజా పార్టీ అని ప్రజా సమస్యలను ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో వెనుకడుగు వేయదని జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వీ మోహన్ రెడ్డి రాంభూపాల్ రెడ్డి అన్నారు కార్యక్రమం లో కొత్తగా నియామకం పొందిన వారి చేత పదవీ ప్రమాణం చేయించారు. కార్యక్రమం లో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి మేయర్ శ్రీ బి వై రామయ్య , శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి , సతీష్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.