PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ ఆదివారం… జీ తెలుగు 19వ వార్షికోత్సవ వేడుక జీ మహోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : 2023 తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం పంచుతూ అగ్రగామిగా నిలుస్తున్న ఛానళ్లలో ఒకటి జీ తెలుగు. ఆసక్తికరమైన కథలతో, ఆకట్టుకునే కథనాలతో సాగుతున్న సీరియల్స్తో పాటు భిన్నమైన కాన్సెప్ట్లతో రూపొందుతున్న రియాలిటీ షోలు, ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని పంచుతున్న జీ తెలుగు విజయవంతంగా 19వ సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సరికొత్త కార్యక్రమాలతో అన్ని వయసుల ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా సాగుతున్న జీ తెలుగు 19 వసంతాల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు టెలివిజన్ చరిత్రలో నూతన ఒరవడి సృష్టిస్తూ విజయపథంలో సాగుతున్న జీ తెలుగు19వ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమం జీ మహోత్సవం మే 19న సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో మాత్రమే!తెలుగు ప్రేక్షకుల నుంచి అశేష ఆదరణ పొందుతూ విజయపథాన కొనసాగుతున్న జీ తెలుగు 19వ వార్షికోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఈ వేడుకలో జయప్రద, రమ్యకృష్ణ, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖ సెలబ్రిటీలు పాల్గొన్నారు. జీ తెలుగు 19 ఏళ్ల ప్రయాణం గురించి యాంకర్లు రవి, సిరి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సరదాగా సాగిన ఈవేడుకలో జూనియర్-సీనియర్ల మధ్య జరిగిన పోటీ ఆద్యంతం అలరిస్తుంది. సీనియర్ జట్టుకి జయప్రద, జూనియర్ జట్టుకి రమ్యకృష్ణ నాయకత్వం వహించారు. ఈ ఇద్దరి గ్రాండ్ ఎంట్రీతో ఘనంగా మొదలైన పోటీడ్రామా జూనియర్స్ అంత్యాక్షరి స్కిట్, 1980, 1990 దశకాల్లోని హీరో హీరోయిన్ల గెటప్లతో సాగిన ప్రదర్శనలతో ఆసక్తికరంగా సాగింది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సర్ప్రైజ్ ఎంట్రీ జూనియర్ టీమ్లో మరింత ఉత్సాహం నింపింది. ఈవేదికపై   డ్రామా జూనియర్స్ పిల్లల అద్భుత ప్రదర్శనతో కె.విశ్వనాథ్, చంద్రమోహన్, శరత్ బాబు వంటి తెలుగు సినిమా దిగ్గజ కళాకారులకు నివాళులు అర్పించారు. అనంతరం నటి జయప్రద, రమ్యకృష్ణ వారితో తమ వ్యక్తిగత జ్ఞాపకాలను పంచుకోవడంతో పాటు సినీపరిశ్రమలో వారు పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు.సరదా సాయంకాలాన్ని మరింత వినోదంగా మారుస్తూ జూనియర్స్, సీనియర్స్ బృందం తల్లీ కొడుకులు, అక్కా చెల్లెళ్ల బంధాలను ప్రతిబింబించే అద్భుత ప్రదర్శనతో అలరించారు. రమ్యకృష్ణ నటించిన పాపులర్ చిత్రం అమ్మోరును జూనియర్ టీం రీక్రియేట్చేసింది. యష్మి, ఇతర జూనియర్ టీం సభ్యులు రమ్యకృష్ణ జీవిత ప్రయాణాన్ని వర్ణించే ప్రదర్శనతో అబ్బురపరిచారు. 80, 90, వర్తమానాల్లో ఆల్ టైమ్ ఫేవరెట్హిట్స్ అయిన ప్రముఖ జీ తెలుగు షో సరిగమపలోని పాటలను సీనియర్లు, జూనియర్లు ఆలపించారు. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమం పాత, కొత్త, గతం, వర్తమానాన్ని ఏకతాటిపైకి తెచ్చింది. ఈ వేడుక జీ తెలుగు 19 సవంవత్సరాల విజయవంతమైన ప్రయాణానికి ప్రతీకగా నిలిచింది.

About Author