PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీ తెలుగు డబుల్ బొనాంజా..

1 min read

సరిగమప పార్టీకి వేళాయెరా డిసెంబర్ 31 రాత్రి 10 గంటలకు, సరికొత్త సీరియల్ చామంతి జనవరి 1న ప్రారంభం ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు !

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  అనునిత్యం వినోదం పంచే కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు మరిన్ని వినోదభరిత కార్యక్రమాలతో 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూనే, నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. ఇటీవల ఖమ్మంలో ఘనంగా జరిగిన ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ కార్యక్రమాన్ని డిసెంబర్ 31, రాత్రి 10 గంటలకు ప్రసారం చేయనుంది. ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్లతో సాగే సీరియల్స్ అందిస్తున్న జీ తెలుగు మరో ఆకట్టుకునే అంశంతో సాగే చామంతి సీరియల్ను నూతన సంవత్సర కానుకగా అందిస్తోంది. ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ డిసెంబర్ 31, సరికొత్త సీరియల్ చామంతి జనవరి 1న(బుధవారం) ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు, మీ జీ తెలుగులో!చలాకీ అమ్మాయి అయిన చామంతి(మేఘనా లోకేష్) తన కుటుంబంతో ఊరిలో జీవిస్తుంది. చామంతి కుటుంబం ఆ ఊరిలో జమీందారీ ఇంట్లో నమ్మకంగా పని చేస్తుంది. చామంతి తండ్రి – రామచంద్రయ్య (ప్రభాకర్), తల్లి మూగ. చామంతి అక్క రోజా వాయుపుత్ర ఎయిర్లైన్స్లో ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తుంది. ఇక జమీందారీ కుటుంబ సహాయంతో ఎదిగిన వ్యక్తి వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఎండీ హర్షవర్ధన్. అరుణ్, ప్రేమ్ హర్షవర్ధన్ వారసులు. పల్లెటూర్లో ఉండే చామంతి హైదరాబాద్ ఎలా చేరుకుంది? చామంతి, ప్రేమ్ మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది? రోజా హర్షవర్ధన్ ఇంటికి ఎలా చేరుకుంటుంది? వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే చామంతి సీరియల్ చూడాల్సిందే. ప్రతిభావంతులైన నటీనటులు, ఆకట్టుకునే కథాంశంతో చామంతి సీరియల్ ప్రేక్షకులను అలరించనుంది. ఇటీవల ఖమ్మం వేదికగా జీ తెలుగు నిర్వహించిన న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్ సరిగమప పార్టీకి వేళాయెరా కార్యక్రమాన్ని 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ప్రసారం చేస్తోంది. యాంకర్ రవి, లాస్య వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సరిగమప గాయనీగాయకులు జీ తెలుగు సీరియల్ నటీనటులతో పోటీపడ్డారు. మేఘసందేశం సీరియల్ నుంచి గగన్ (అభినవ్), భూమి (భూమిక), నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి అమరేంద్ర (రిచర్డ్ జోస్), అరుంధతి (పల్లవి గౌడ), భాగమతి(నిసర్గ గౌడ), చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ నుంచి మిత్ర (రఘు), లక్ష్మి (మహి గౌతమి) తదితరులు పాల్గొని అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.  ఈ వేదికపై ప్రతిభావంతులైన దివ్యాంగులను ప్రోత్సహించింది జీ తెలుగు. 2024 సంవత్సరానికి ఘనమైన వీడ్కోలు పలుకుతూ అభిమానుల కోలాహలంతో సాగిన ఈ కార్యక్రమాన్ని మీరూ మిస్ కాకుండా చూసేయండి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *