PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదరికం విద్యకు అడ్డు కాకూడదు జడ్పీ సీఈఓ..

1 min read

విద్యార్థులు కష్టపడి కాదు ఇష్టపడి చదవాలి బిఎస్ఎన్ఎల్ డీజీఎం.

విద్యార్థులు ఉన్నత ఆశయాలు కలిగి చదవాలి రిటైర్డ్ సీఈఓ.

విద్యాభివృద్ధికి ఓసా సేవలు అభినందనీయం తాసిల్దార్.

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:    పేదరికం విద్యకు అడ్డుకాకూడదని జిల్లా పరిషత్ సీఈవో జి నాసరా రెడ్డి అన్నారు. మంగళవారం నాడు వెలుగోడు పట్టణ జిల్లా పరిషత్ పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో సభాధ్యక్షుడు హెచ్ఎం సత్యనారాయణ హెడ్గే అధ్యక్షతన విద్యార్థి ప్రోత్సాహక అభినందన సభ  నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రార్థన, అతిథులు  జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పి స్వర్గస్తులైన ఉపాధ్యాయుల, పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.అనంతరం జెడ్పి సీఈఓ నాసరా రెడ్డి మాట్లాడుతూ విద్యకు పేదరిక అడ్డు కాకూడదని, పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలన్నారు. బిఎస్ఎన్ఎల్ డిజిఎం రాజేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాదు ఇష్టపడి చదివినట్లయితే అనుకున్నది సాధించవచ్చు అన్నారు . రిటైర్డ్ సీఈఓ పూర్వ విద్యార్థుల సంఘం  గౌరవ అధ్యక్షులు గుర్రం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఆశయాలు కలిగి విద్యను అభ్యసించినట్లయితే దేనినైనా సాధించవచ్చు అన్నారు.అదే సమయంలో విద్యార్థులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు.  తాసిల్దార్ శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం సేవలు అభినందనీయమన్నారు. ఈ సేవలను కొనసాగించడానికి అందరూ సహకరించాలన్నారు. తదుపరి సంఘం కార్యదర్శి మక్బుల్ భాష ఓసా నివేదికను వివరించారు. గత 16 సంవత్సరాలుగా దాతల సహకారంతో విద్యార్థిన ప్రోత్సాహక అభినందన సభ నిర్వహించి ప్రతిభ చాటిన పదవ తరగతి విద్యార్థులకు ఎంసెట్, నీట్, బిటెక్, ఐఐటి ,ఎన్ఐటి, త్రిబుల్ ఐటీ, తదితర ఉన్నత విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానాలు వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేద ప్రతిభ చాటిన విద్యార్థులకు వారి విద్య కోసం డిగ్రీ వరకు ప్రతి సంవత్సరం 6000 రూపాయలు చొప్పున స్కాలర్షిప్ల పంపిణీ ,స్కూల్ టాపర్ ,స్కూల్ ఆర్ రౌండర్, స్కూల్ లేడీ టాపర్, తెలుగు సబ్జెక్టులో టాపర్లకు నగదు ఆర్థిక బహుమతులను అందజేస్తున్నామన్నారు. ఐఐటీ ఇండోర్ కళాశాలలో సీటు సాధించిన కే వి ఎల్ శరత్ చంద్ర ను పూలమాలలు శాలువా మెమొంటోలతో అతిథులు సన్మానించారు. పదవ తరగతిలో టాపర్లుగా నిలిచిన వెలుగోడు జడ్పీ పాఠశాల విద్యార్థులు సానియా, నాజియా, సంధ్య ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి సాయి చరణ్, కస్తూరిబా పాఠశాల విద్యార్థులు చంద్రావతి, ఇస్తేరమ్మ లిటిల్ ఏంజిల్స్ విద్యార్థి అనిషా తపస్సుo, డి పౌల్ పాఠశాల విద్యార్థి నిఖిల్, జి బి ఎం పాఠశాల విద్యార్థి బ్రాహ్మణి లను అతిథులు పూలమాలలు శాలువలు మెమొంటోలతో సన్మానించారు.హుస్సేన్ భాష, చరణ్ తేజ నాయక్ ,హేమలత, నర్సిరుద్దీన్, రుక్సానా, తహసీమ్, నాజియా, సంధ్య, భవాని శంకర్ ,బాలాజీ రావు, సానియా, ఆసియా, కాజీమ్ హుస్సేన్ లకు ఒక్కొక్కరి 6000 రూపాయల చేకులను అతిథుల చేతుల మీదుగా అందించారు. తెలుగు పండిత్ సుబ్బరాయుడు పేరున అవార్డు పొందిన నాజియా, పావని సానియాల కు 1500 రూపాయలు చెక్కులను అందించారు.పాఠశాల లేడీ టాపర్ సానియాకు 5000 రూపాయల చెక్కు, పాఠశాల ఆల్రౌండర్ భవాని శంకర్ 5000 రూపాయలు చెక్కును అతిథుల చేతుల మీదుగా అందించారు. అనంతరం అతిధులు  సీఈఓ నాసారెడ్డి, బిఎస్ఎన్ఎల్ డీజీఎం రాజేశ్వరరావు, , ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్ సూపరిండెంట్ మురళీమోహన్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ నళిని  దాతలు జి రవిశంకర్ అహ్మద్ హుస్సేన్ తాళ్లూరి రంగనాథ్ లను పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బ్రహ్మయ్య ఆచారి., లిటిల్ ఏంజిల్స్ పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎం.ఎఫ్ ఇమ్మానియేల్ సర్పంచ్ వేల్పుల జైపాల్, జయరామిరెడ్డి, కే సుధాకర్ ఆచారి, పి చంద్రశేఖర్ ఆచారి ,సుల్తాన్ మొహిద్దిన్, నసురుల్లా ఖాన్, ఇరుగురి శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి , లక్ష్మీనారాయణ, శ్రీరాములు, కుదరదుల్లా రాం పుల్లయ్య. ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

About Author