జోనల్ స్థాయి పోటీల్లో జడ్పిహెచ్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదోని రోటరీ క్లబ్ ఆధ్వరంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో అద్భుత ప్రతిభ చాటారనిహొళగుంద ప్రధానోపాధ్యాయులు నజీర్ అహ్మద్ తెలిపారు ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులు బాలికలు జోనల్ స్థానంలో కబడ్డీలో బాలికల జట్టు ప్రథమ స్థానము బాలుర జట్టు ద్వితీయ స్థానం వచ్చినట్లు తెలిపారు వారిని ప్రశాంత పత్రము మెడల్ ట్రోఫీతో బహుకరించినట్లు నజీర్ అహ్మద్ తెలిపారు విద్యార్థులు చదువుతూపాటు క్రీడల్లో రాణించాలని అన్నారు పాఠశాల సిబ్బంది విద్యా కమిటీ చైర్మన్ ద్వార్కనాథ్ ఆచారి, కమిటీ సభ్యులు తల్లిదండ్రులు గ్రామస్తులు విద్యార్థులను అభినందించారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మీటు నాయక్, గోపాల్, నజీర్ అహ్మద్, జనార్ధన్, దస్తగిరి వలి, మదన్ మోహన్, మురళి, రిజ్వాన పర్వీన్, శకుంతల, మల్లేశ్వరి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.