PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆత్మకూరులో వైసీపీ హవా..!

1 min read
అమలాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవం వైసిపి

అమలాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవం వైసిపి


– 16కు మూడు ఏకగ్రీవం… 11న ఘనవిజయం
– మిగిలిన రెండు టీడీపీ కైవసం
కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని 16 గ్రామపంచాయతీలలో ఫ్యాన్​ గాలి హవా కొనసాగింది. తొలిదశ ఎన్నికల్లో 16 గ్రామపంచాయతీలకుగాను మూడు వైసీపీ ఏకగ్రీవం చేసుకోగా.. 11 స్థానాలు బరిలో నిలిచి ఘన విజయం సాధించింది. మిగిలిన రెండు స్థానాలు టీడీపీ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థులు మాట్లాడుతూ సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ గెలుపునకు ప్రధాన కారణమన్నారు. అంతేకాక ఓటర్లు తమ ప్రభుత్వ పాలనను అభినందించారని, అందుకు … గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపే .. నిదర్శనమన్నారు.
గ్రామపంచాయతీల వారీగా గెలిచిన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి.
జీ.పీ. అభ్యర్థి పార్టీ మెజార్టీ

  1. ‌క్రిష్ణాపురం సంద్యరాణి వైసీపీ అభ్యర్థి ఓట్ల మెజారిటీ 802
  2. ‌సంజీవనగర్ తాండ శివనాయక్ వైసీపీ అభ్యర్థి ఓట్ల మెజారిటీ 137
  3. ‌సిద్దపల్లె పంచాయతీకి రేనాటి ఎల్లారెడ్డి వైసీపీ అభ్యర్థి ఓట్ల మెజారిటీ 302
  4. బైర్లటి పంచాయతి గురువమ్మ వైసీపీ అభ్యర్థి ఓట్ల మెజారిటీ 172
  5. ఇందిరేశ్వరం వైసీపీ అభ్యర్థి ఏర్వ నారాయణ రెడ్డి ఓట్ల మెజారిటీ 244
  6. శ్రీపతి రావు పేట వైసీపీ అభ్యర్థి P.వాణి ఓట్ల మెజారిటీ 198
  7. వడ్లరామాపురం లక్ష్మమ్మ వైసిపీ అభ్యర్థి యేసు ఓట్ల మెజారిటీ 447
  8. కరివేన మురహరి మాణిక్యమ్మ ఓట్ల మెజార్టీ 562
  9. పిన్నాపురం టీ డీ పీ విజయం వెంకటాపురం మెజారిటీ 292
    10.కురుకుంద – గ్రామం వైసీపీ అభ్యర్థి ఓట్ల మెజారిటీ 77
    11.బాపనంతపురం ఓట్ల తేడాతో టిడిపి 32
    12.ముష్టపల్లే వైసీపీ అభ్యర్థి దేవి బాయి 303వైసీపీ
    13.నల్లకాలువ- అభ్యర్థి 234 ఓట్ల వైసీపీ

ఏకగ్రీవం అయిన గ్రామపంచాయతీలు

  1. కొట్టాల చెరువు – ఏకగ్రీవం వైసిపి
  2. అమలాపురం- ఏకగ్రీవం వైసిపి
  3. సిద్దాపురం- ఏకగ్రీవం వైసిపి

About Author