కప్పట్రాళ్లలో ‘పోలింగ్’ను పరిశీలించిన కలెక్టర్
1 min readపల్లెవెలుగు, దేవనకొండ ;
జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం అత్యంత సమస్యాత్మక గ్రామమైన కప్పట్రాళ్ళ గ్రామ పోలింగ్ కేంద్రం జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్ జి. వీరపాండియన్, ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప పరిశీలించారు. నాల్గవ విడత ఎన్నికల జరుగుతున్న సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద చేసిన భద్రతా ఏర్పాట్లను , ఎన్నికల పోలీంగ్ సరళిని , ఓటర్ల క్యూ లైన్ ను పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారి వెంట డోన్ డిఎస్పీ నరసింహా రెడ్డి, దేవనకొండ ఎమ్ ఆర్ ఓ శ్రీమతి ఇంద్రాణి, ఎమ్ పి డి ఓ ఆదయ్య, పత్తికొండ రూరల్ సిఐ డి.వి నారాయణ రెడ్డి, ఫ్యాక్షన్ జోన్ సిఐ రమణ, నంద్యాల రూరల్ సిఐ మల్లికార్జున, దేవనకొండ ఎస్సై నరసింహులు ఉన్నారు.