జేసీ ప్రభాకరరెడ్డి పై మరో కేసు
1 min readతాడిపత్రి; ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీద మరో కేసు నమోదయ్యింది. ఇటీవల వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత అనేక కేసులు ఎదుర్కొంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి మీద తాజాగా మరో కేసు నమోదయ్యింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాడిపత్రి పట్టణంలో క్రికెట్ కిట్లు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ సమీప బందువు గౌరీనాథ్ రెడ్డి ఇంట్లో క్రికెట్ కిట్లు లభ్యమౌన నేపథ్యంలో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డితోపాటు , గౌరీనాథ్ రెడ్డి మీద కూడ కేసు నమోదు చేశారు.