దివంగత నేతకు ఘననివాళి
1 min readపల్లెవెలుగు, కర్నూలు
ఏపీ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అని, ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉప అధ్యక్షులు మాలిక్ బాష అన్నారు. ఆదివారం దివంగత నేత దామోదరం సంజీవయ్య శతజయంతిని పురస్కరించుకుని నగరంలోని సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంజీవయ్య దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు సమీ బాషా మరియు ఎంహెచ్పీఎస్ టీమ్ తదితరులు పాల్గొన్నారు.
సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మాలిక్బాష