PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పవన్​ సినిమాలో.. హిమజకు ఛాన్స్​

1 min read

శుభాకాంక్షలు తెలిపిన పవన్​
నటి హిమజకు.. తన అభిమాన నటుడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ రాయడంతో హిమజ మురిసిపోతోంది. పలు సీరియళ్లు, ‘ బిగ్‌బాస్ ’ కార్యక్రమంతో తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించున్న హిమజ.. పవన్ కల్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రంలో పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాత్రకు హిమజ ఎంపికైంది. తన అభిమాన నటుడితో కనిపించే ఛాన్స్ రావడంతో హిమజ ఉబ్బితబ్బిబ్బవుతోంది. పవన్‌తో దిగిన సెల్ఫీలను ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పవన్ తనకు రాసిన లేఖను హిమజ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. హిమజ గారికి, మీకు అన్ని శుభాలు జరగాలని, వృత్తిపరంగా మీరు ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను అని పేర్కొంటూ పవన్‌ ఓ లేఖను హిమజకు పంపించారు. ఈ లేఖను హిమజ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. నా ఆనందాన్ని మాటల్లోనూ, ఎమోజీల్లోనూ చెప్పలేకపోతున్నానని పేర్కొంది.

About Author