PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బన్నీతో.. ఓకేనంటున్న మలయళ భామ

1 min read

కొంటెగా కన్ను గీటి.. యువత కళ్లు పక్కకు తిప్పకుండా చేసిన… మలయళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగులో అరంగేట్రానికి సిద్ధమవుతోంది. నితిన్‌ కథానాయకుడిగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెక్’ సినిమాలో ప్రియ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రియ.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడింది. స్టైలిష్‌స్టార్‌కు కేరళలో భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారని, నేనూ..బన్నీ అభిమానినేనని చెప్పుకొచ్చింది. బన్నీ సినిమాలో నటించే అవకాశం నాకు వచ్చిందని, నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని ఇటీవల వార్తలు వచ్చాయని, కానీ ఆ వార్తలు నిజం కాదన్నారరు. ఒకవేళ బన్నీ పక్కన నటించే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని ప్రియ స్పష్టం చేసింది.

About Author