మహిళలకు సమాన హక్కు కల్పించాలి
1 min read– ఎన్డబ్య్లూపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం
పల్లెవెలుగు, కర్నూలు;
చట్టసభలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలని ఎన్డబ్య్లూపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం
డిమాండ్ చేశారు. శనివారం జాతీయ మహిళా స్థానిక పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్. హసీనాబేగం మాట్లాడుతూ సృష్టిలో గొప్పది ఏదైనా ఉందంటే … అది మహిళేనని, అలాంటి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. మహిళలకు జరుగుతున్న దాడులు నియంత్రించాలంటే.. పార్లమెంటులో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఉమెన్స పార్టీ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ ఎన్. మేరీ, ఉమెన్స్ వింగ్ జనరల్ సెక్రెటరీ కృష్ణవేణి, ఎస్.సుజాత, టీ. విజయమ్మ, భార్గవి సుజాత, ప్రతిభ కుమారి, శంకరమ్మ, స్రవంతి, సునీత బాయ్, మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.