ముందస్తు.. హామీ..!
1 min read– సమస్యలు చెప్పండి… పరిష్కరిస్తాం..
– వార్డు పర్యటనలో వైసీపీ నాయకుల హామీ
పల్లెవెలుగు, కర్నూలు;
ఓ వైపు గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. మున్సిపల్ పరిధిలోని వైసీపీ, టీడీపీ నాయకుల్లో అలజడి మొదలైంది. జీ.పీ. ఎన్నికల తరువాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ వెనువెంటనే.. మున్సిపల్ పరిధిలోని ఎన్నికలు జరుగుతాయని సంకేతాలు వెలువడటంతో .. నాయకులు తమ తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. గురువారం స్థానిక బుధవార పేటలో ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ ఆదేశాల మేరకు.. ఆ వార్డు సమన్వయకర్త కేదర్నాథ్ కార్యకర్తలతో కలిసి వార్డులో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమం లో 15వ వార్డు ఇంచార్జీ వెంకటేశ్వరమ్మ, వాణి, వరలక్ష్మి, నాగమణి, సురేఖ, జశ్వంత్, వసంత్, దినకర్, శంకర్ పాల్గొన్నారు.