మేయర్…‘లోకల్’ కే ప్రాధాన్యం
1 min readలేకుంటే.. కర్నూలు అభివృద్ధి అగమ్యగోచరం..
– టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ టీజీ భరత్
పల్లెవెలుగు, కర్నూలు
కర్నూలు మున్సిపల్ పరిధిలో గెలిచిన అభ్యర్థినే … మేయర్‌గా చేయాలని, లేదంటే కర్నూలు అభివృద్ధి అగమ్యగోచరంగా మారుతుందని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ టీజీ భరత్ ఉద్ఘాటించారు. కర్నూలు వాసి.. మేయర్ కావాలని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం 1వ వార్డులోని కోట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పూజలు చేసిన అనంతరం ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ వైసీపీ.. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని వార్డుల నుంచి గెలిచిన కార్పోరేటర్‌ను కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ మేయర్‌గా చేయాలని భావిస్తోందని, పాణ్యం కార్పోరేటర్‌ను మేయర్‌గా చేస్తే కర్నూలు అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. 33 వార్డులున్న కర్నూలు నియోజకవర్గం నుంచి కాదని.. 16 వార్డులు ఉన్న పాణ్యం నియోజకవర్గం నుంచి గెలిచిన వ్యక్తిని మేయర్ చేయడం ఏమిటని ఘాటుగా ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రజలందరూ ఆలోచించి.. ఓటు వేయాలని సూచించారు. అనంతరం 1వ వార్డు అభ్యర్థిగా రమీజ్ బాషను, 2వ వార్డు అభ్యర్థిగా అబ్దుల్ లతీఫ్, 3వ వార్డు అభ్యర్థి కె. ఉమామహేశ్వరి, 4వ వార్డు అభ్యర్థి పి. సరితలను ప్రజలకు పరిచయం చేస్తూ గెలిపించాలని కోరారు. ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ర్ట ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.