అద్దె అడిగితే చంపేస్తారా?
1 min readపశ్చిమగోదావరి:
పాలకొల్లు లో దారుణం జరిగింది. ఇంటి యజమాని అద్దె అడిగినందుకు బండరాయితో మోది చంపాడో ప్రబుద్దుడు. అడపా చిన్న కొండయ్య అనే వ్యక్తి పాలకొల్లులో వంగా ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో కొన్నాళ్లుగా అద్దెకుంటున్నాడు. అయితే.. ఈ నెల అద్దె అడిగేందుకు వెళ్లిన ప్రసాద్ తో కొండయ్య వాగ్వాదానికి దిగాడు. అదే క్రమంలో ప్రసాద్ తల మీద బండరాయితో కొట్టాడు. దీంతో వంగా ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే… అడపా చిన్న కొండయ్య నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు.