NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభివృద్ధి ప్రశ్నార్థకం..!

1 min read
సర్పంచ్​ అభ్యర్థులతో మాట్లాడుతున్న మాండ్ర శివానంద రెడ్డి

సర్పంచ్​ అభ్యర్థులతో మాట్లాడుతున్న మాండ్ర శివానంద రెడ్డి

– అరాచకపాలనకు చరమగీతం పాడండి
– టీడీపీ నంద్యాల పార్లమెంటు పార్టీ ఇంచార్జీ మాండ్ర శివానంద రెడ్డి
పల్లె వెలుగు, నందికొట్కూరు;
సాధారణ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా నంద్యాల పార్లమెంటు పార్టీ ఇంచార్జీ మాండ్ర శివానంద రెడ్డి విమర్శించారు. గురువారం నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో ఆయన తెలుగుదేశం మద్దతు దారులు సర్పంచి అభ్యర్థులతో మాట్లాడారు. అనంతరం గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు పంచాయతీ ఎన్నికలు నాంది పలికేలా తెదేపా మద్దతుదారు అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధిని విస్మరించి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. తెదేపా హయాంలో జరిగిన ప్రగతిని వివరించాలన్నారు. మండల నాయకులు పుల్యాల రాజశేఖర్ రెడ్డి, పల్లె రఘరామి రెడ్డి, మహేష నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

About Author