PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అస్వస్థతకు గురైన నెమలి

1 min read
నెమలికి వైద్య పరీక్షలు అందిస్తున్న సెక్షన్ అధికారి సుబ్బయ్య

నెమలికి వైద్య పరీక్షలు అందిస్తున్న సెక్షన్ అధికారి సుబ్బయ్య

 పల్లె వెలుగు, రుద్రవరం; రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని ఆలమూరు గ్రామంలో అస్వస్థకు గురైన నెమలికి వైద్య పరీక్షలు అందిస్తున్నట్లు రేంజ్ అధికారి శ్రీరాములు శనివారం తెలిపారు. రేంజ్ పరిధిలోని ఆలమూరు సెక్షన్ లో గల మిట్టపల్లె సమీపంలోని ఎర్ర చెరువు ప్రాంతంలో నెమలి అస్వస్థతకు గురైనట్లు గమనించిన మిట్టపల్లె గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారన్నారు. సమాచారం అందుకున్న సెక్షన్ అధికారి సుబ్బయ్య వైద్యాధికారి మనోరంజన్ ప్రతాప్ ను తీసుకుని సిబ్బందితో ఎర్ర చెరువు ప్రాంతం వెళ్లి అస్వస్థకు గురైన నెమలిని పట్టుకుని వైద్య సేవలు అందించారన్నారు. నెమలికి వైద్య సేవలు అందించిన కదలలేక నడవలేక ఎగరలేక పోవడంతో సెక్షన్ అధికారి సుబ్బయ్య నెమలి ఆలమూరు సెక్షన్ కార్యాలయానికి తీసుకు వచ్చారన్నారు. మరో రెండు రోజులు వైద్య సేవలు అందించిన అనంతరం నెమలి ఆరోగ్యం కుదుట పడిన వెంటనే అటవీ ప్రాంతంలో వదులుతామని రేంజర్ తెలిపారు.

About Author