PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంటింటికి.. బియ్యం పంపిణీ చేయండి..

1 min read
అధికారులతో మాట్లాడుతున్న ఇన్​చార్జ్​ కలెక్టర్​ రాంసుందర్​ రెడ్డి

అధికారులతో మాట్లాడుతున్న ఇన్​చార్జ్​ కలెక్టర్​ రాంసుందర్​ రెడ్డి

– ఫిర్యాదులు రాకుండా చూసుకోండి

  • జిల్లా ఇన్​చార్జ్​ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి
    పల్లెవెలుగు, కర్నూలు;
    ఇంటింటికి బియ్యం పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా ఇన్​చార్జ్​ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో జిల్లాలో ఎం డి యు వాహనాల ద్వారా ఇంటింటికి బియ్యం పంపిణీ పై జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రామ సుందర్ రెడ్డి సమీక్షించారు.
    ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ చౌక దుకాణం డీలర్లు ఉదయం 6.30 గంటలకు రేషన్ సరుకులను ఎండియు వాహనాల ఆపరేటర్లకు ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ కోసం నిత్యావసర సరుకులను అందజేయాలన్నారు. కొంతమంది డీలర్లు రేషన్ బియ్యం పంపిణీ లో వీఆర్వోలు, ఎండియు వాహనాల ఆపరేటర్లకు సహకరించటం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని… ఇలాగే కొనసాగితే సంబంధిత రేషన్ డీలర్ల పై చర్యలు తీసుకుంటామన్నారు. ఎండియు వాహనాల ఆపరేటర్లు రేషన్ పంపిణీలో ఏ రోజుకారోజు వచ్చిన డబ్బును రేషన్ డీలర్ కు అందజేసి వెంటనే రసీదు తీసుకోవాలని, వాహనాల ఆపరేటర్ లు, వీఆర్వోలకు సహకరించని డీలర్ల పై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. పదిమంది ఎండియు ఆపరేటర్ల పనితీరు పర్యవేక్షణ కోసం డిప్యూటీ తాసిల్దారులను పర్యవేక్షణ అధికారులుగా నియమించామన్నారు. ఎండియు ఆపరేటర్లు ఖచ్చితమైన సమయానికి రేషన్ డీలర్ల దగ్గరకు వెళ్లి రేషన్ తీసుకొని ఇంటింటికి రేషన్ పంపిణీ పకడ్బందీగా చేపట్టాలన్నారు. తమకు కేటాయించిన విధులలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఖచ్చితంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. సమీక్షలో డిఆర్వో పుల్లయ్య, కర్నూలు ఆర్డీవో వెంకటేశు, ఇన్చార్జి డిఎస్ఓ షర్మిల, కర్నూలు అర్బన్ తహసీల్దార్ తిరుపతి సాయి, కల్లూరు తాసిల్దార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author