PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగ భద్రత కల్పించండి

1 min read
మాట్లాడుతున్న ఎన్​డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం

మాట్లాడుతున్న ఎన్​డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం

– కోవిడ్​–19 వారియర్స్​ నిరసన
– మద్దతిచ్చిన ఎన్​డబ్య్లూపీ జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం
పల్లెవెలుగు,కర్నూలు
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్​ విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలు ఫణంగా పెట్టి.. వైద్య సేవలు అందించామని, సేవలను గుర్తించి.. ఉద్యోగ భద్రత కల్పించాలని కోవిడ్​–19 వారియర్స్​, డాక్టర్స్ ఆల్ పారామెడికల్ టెక్నీషియన్స్ మరియు స్టాఫ్ వర్క్స్ రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరారు. 24 రోజులుగా దీక్ష చేస్తున్న ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కర్నూల్ సభ్యులకు నేషనల్​ ఉమెన్స్​ పార్టీ జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చేస్తున్న ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్​ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్​డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలకు విశేష సేవలు అందించిన కోవిడ్​–19 వారియర్స్​ను ఉద్యోగం నుంచి తొలగించడం సరైన పద్ధతి కాదన్నారు. దేశానికి రక్షణగా నిలిచిన సైనికులు మాదిరిగానే… ప్రజలకు రక్షణగా నిలిచిన వారియర్స్​ రావాల్సిన వేతనాలు ఇచ్చి.. మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆమె డిమాండ్​ చేశారు. నిరసనలో ఉండగానే… కాంట్రాక్ట్​ ఉద్యోగి జ్యోతి అక్కడే.. కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను ఓ షాపు వద్దకు తీసుకెళ్లి మనోధైర్యం కల్పించారు. కార్యక్రమంలో నేషనల్ వింగ్ ప్రెసిడెంట్ మేరీ, పిఆర్ఓ సురేఖ, కర్నూల్ యూత్ ప్రెసిడెంట్ ఇంతియాజ, మరియు కార్యాలయం వాలెంటరీలు సిమ్రాన్, అనిత పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author