ఉపాధ్యాయుడిగా.. కమిషనర్..!
1 min readలెక్కలు చేయించి.. పాఠాలు బోధించి..
– విద్యార్థుల నైపుణ్యం వెలికి తీసిన డీ.కే. బాలాజి
పల్లెవెలుగు, కర్నూలు కార్పొరేషన్ ;
ఉపాధ్యాయుడిగా పరిచయమై… లెక్కలు చేయించి.. పాఠాలు బోధించాడు.. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసి… మెరుగైన మార్కులు సాధించడం… జీవితంలో విజయం వైపు పయనించడం తదితర అంశాలను వివరించారు..
కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజి. మంగళవారం నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్మారక నగర పాలక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన… విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్నభోజనం, రికార్డులు, విద్యాబోధన వంటి అంశాలపై ఆరా తీశారు. భవిష్యత్ లో మీ లక్ష్యం ఏమిటని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించి, బియ్యం, బ్యాళ్లు, సరుకులు, చిక్కి ఇతర పదార్థాల స్టాక్ బుక్ లు, సబ్జెక్టుల వారిగా భోధిస్తున్న పాఠ్య౦శాల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ప్రతి క్లాస్ రూమ్ కు వెళ్లి విద్యార్థులకు బోధిస్తున్న సబ్జెక్టుల వారీగా జరుగుతున్న అకాడమిక్స్ గురించి ఆరా తీశారు. విద్యార్థులకు కొన్ని లెక్కల ప్రశ్నలు వేసి వారి చేత బ్లాక్ బోర్డ్ పై చేయించారు. సరైన సమాధానం చెప్పిన వారికి చాక్లెట్ ను బహుకరించారు. అలాగే టెక్స్ట్ బుక్ లోని తెలుగు, ఇంగ్లీష్ బుక్ లోని పాఠాల వ్యాసాలను చదివించారు. అనంతరం మునిసిపల్ కమిషనర్ బాలాజీ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా విషయ పరిజ్ఞానాన్ని, విద్యను అందిస్తే మంచి ఫలితాలు సాధిస్తారని ఉపాధ్యాయులకు సూచించారు.