NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్నికలకు భారీ బందోబస్తు..

1 min read
ఆళ్లగడ్డలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు

ఆళ్లగడ్డలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల, చాగలమర్రి, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు తదితర ప్రాంతాల్లో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేయగా.. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో నిర్బయంగా వినియోగించుకున్నారు. 12 మండలాలు, 142 గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు 80 శాతం ఓటింగ్​ పూర్తయినట్లు జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్​ జి. వీరపాండియన్​ వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాలైన ఆళ్ళగడ్డ, ఉయ్యాలవాడ , దొర్నిపాడు, వెలుగోడు మండలాలోని ఆయా గ్రామాలలో పోలీసు బలగాలు పహారా కాస్తున్నాయి.

About Author