NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్నికలు ..శాంతియుతంగా నిర్వహించండి

1 min read
ఎన్నికలపై ప్రజలకు వివరిస్తున్న డీఎస్పీ చిదానందరెడ్డి

ఎన్నికలపై ప్రజలకు వివరిస్తున్న డీఎస్పీ చిదానందరెడ్డి

– నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి
పల్లె వెలుగు, గడివేముల;
మండలంలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలు శనివారం జరుగుతున్ననేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో డి.ఎస్.పి చిదానంద రెడ్డి అన్నారు. గురువారం సిఐ సి. జీవన్ గంగ నాథ్ బాబు, ఎస్సై సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యలు సృష్టించిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 144 సెక్షన్ పోలింగ్ కేంద్రాల వద్ద అమలులో ఉంటుందన్నారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన డీఎస్పీ… విజయోత్సవ ర్యాలీ నిర్వహించరాదని, బాణసంచా కాల్చరాదన్నారు. సమావేశంలో గ్రామస్తులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
ఎన్నికలపై ప్రజలకు వివరిస్తున్న డీఎస్పీ చిదానందరెడ్డి

About Author