PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్‌ఏ-1కు టెన్త్‌ విద్యార్థులకు 11 పేపర్లే…

1 min read

వార్షిక పరీక్షలకు మాత్రం 6 పేపర్లు

 ఎస్‌ఏ-1కు టెన్త్‌ విద్యార్థులకు 11 పేపర్లే.. 

హైదరాబాద్‌,పల్లె వెలుగు: విద్యార్థుల్లో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల గందరగోళం ఏర్పడుతోంది. నవంబర్‌ 1వ తేదీ నుంచి జరిగే సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ-1) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఈనెల 12న పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం 9, 10వ తరగతి విద్యార్థులకు ఆరు పేపర్లు ఉంటాయని అందులో పేర్కొన్నారు. అయితే అప్పటికే కొన్ని జిల్లాల్లో ఆ జిల్లా విద్యాధికారుల ఆదేశాల మేరకు 11 పేపర్లకుగాను ప్రశ్నపత్రాలను ప్రింటింగ్‌ చేశారు. అయితే ఆరు పేపర్లే ఉంటాయని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొనడంతో కొత్తగా మళ్లి ప్రశ్నపత్రాలను రూపొందించాల్సి ఉంటుంది. దీంతో వెనక్కి తగ్గిన అధికారులు నవంబర్‌ 1 నుంచి జరిగే ఎస్‌ఏ-1కు మాత్రం 11 పేపర్లకు పరీక్షను నిర్వహించేలా, ఎస్‌ఏ-2, ఎస్‌ఎస్‌సీ వార్షిక పరీక్షలకు మాత్రం 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించేలా బుధవారం మళ్లిd తాజా ఉత్తర్వులు జారీ చేశారు. అధికారుల తీరు, అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో గందరగోళం ఏర్పడింది. మారిన షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 1 నుంచి 7వ తేదీ వరకు ఎస్‌ఏ-1 పరీక్షలను ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థులు రాయనున్నారు. ఉదయం ఒక పేపర్‌, మధ్యాహ్నం మరో పేపర్‌కు పరీక్షలు నిర్వహించేలా అధికారులు షెడ్యూల్‌ను రూపొందించారు.

About Author