NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓటు విలువ తెలుసుకోండి…

1 min read
మాట్లాడుతున్న మున్సిపల్​ అడిషనల్​ కమిషనర్​ రామలింగేశ్వర్

మాట్లాడుతున్న మున్సిపల్​ అడిషనల్​ కమిషనర్​ రామలింగేశ్వర్

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
​– మున్సిపల్​ అడిషనల్​ కమిషనర్​ రామలింగేశ్వర్
పల్లెవెలుగు, కర్నూలు : ఓటు విలువ తెలుసుకొని..ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మున్సిపల్​ అడిషనల్​ కమిషనర్​ రామలింగేశ్వర్ అన్నారు. 18 ఏళ్ల వయస్సున్న ప్రతిఒక్కరు ఓటు హక్కు పొందాలని, ఓటు వేయడం అందరూ బాధ్యతగా భావించాలన్నారు. మంగళవారం స్థానిక కేవీఆర్​ మహిళా డిగ్రీ కళాశాలలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్​ అడిషనల్​ కమిషనర్​ రామలింగేశ్వర్ మాట్లాడుతూ చదువుతోనే చైతన్యవంతులు అవుతామని, ప్రతిఒక్కరూ బాగా చదవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఓటరుగా నమోదు చేసుకునే ప్రక్రియ, ఓటుపై చైతన్యం తదితర అంశాలను వివరించారు. అనంతరం డిప్యూటీ కమిషనరు పద్మావతి మాట్లాడుతూ ఈనెల 10న జరిగే నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరూ ఓటు వేసి… బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్​ ప్రిన్సిపాల్ మెప్మా సిటీ మిషన్​ మేనేజర్​ మురళీ, టీఎంసీలు, కమిటీ ఆర్గనైజర్లు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author