PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటెత్తిన జనం..80.76 శాతం పోలింగ్‌

1 min read
విలేకరులతో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్​ జి. వీరపాండియన్​, ఎస్పీ ఫక్కీరప్ప

విలేకరులతో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్​ జి. వీరపాండియన్​, ఎస్పీ ఫక్కీరప్ప

– ప్రశాంతంగా ముగిసిన రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు
– ఓటు హక్కు వినియోగించుకున్న 3,52,577 మంది ఓటర్లు
– అత్యధికంగా గూడూరు మండలంలో దాదాపు 87.79% నమోదు
– అతి తక్కువ కోయిలకుంట్ల మండలంలో 71.83 శాతం పోలింగ్
– పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్పలు
పల్లెవెలుగు, కర్నూలు; కర్నూలు జిల్లాలో 13 మండలాలలో 183 గ్రామ పంచాయతీలలో రెండవ దశ గ్రామ పంచాయతీల సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అందుకు సహకరించిన ఓటర్ల తో పాటు అధికారులందరికీ జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప లు ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ ఎన్నికల వార్ రూమ్/కంట్రోల్ రూమ్ లో రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప లు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా విజయవంతంగా ముగిసిందని..కౌంటింగ్, ఉప సర్పంచ్ ఎన్నికకు ప్రత్యేక ఏర్పాట్లు, అదనపు భద్రత ఏర్పాటు చేశామన్నారు. కర్నూలు జిల్లాలో రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లు ప్రశాంతంగా…నిర్భయంగా, స్వేచ్ఛగా పవిత్ర ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 13 మండలాల్లో 183 గ్రామపంచాయతీలో ఎన్నికలు జరగగా అందులో మొత్తం 4,36,565 ఓటర్లు ఉండగా 3,52,577 మంది ఎన్నికల పోలింగ్ లో పాల్గొని ఓటు వినియోగించుకోగా….80.76% నమోదయ్యాయన్నారు. అత్యధికంగా గూడూరు మండలంలో దాదాపు 87.79% నమోదైంది.. అతి తక్కువ కోయిలకుంట్ల మండలంలో 71.83 శాతం పోలింగ్ నమోదైంది. ఎక్కడ గొడవ లేకుండా ప్రశాంతంగా పోలింగ్ ఎన్నికలు జరిగాయని అందుకు సహకరించిన ఓటర్లకు, అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.అనంతరం ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప మాట్లాడుతూ రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల పోలింగ్ జరిగాయన్నారు. ఓట్ల లెక్కింపులో ఎక్కడా గొడవ జరగకుండా ఉండేందుకు అదనపు పోలీస్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మోహిద్దీన్, సమాచార శాఖ ఉపసంచాలకులు తిమ్మప్ప పాల్గొన్నారు.

About Author