PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కనులవిందుగా.. అమ్మవారి ఆత్మార్పణ మహోత్సవం

1 min read
రుద్రవరంలోని అమ్మవారి శాల లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ కార్యక్రమం

రుద్రవరంలోని అమ్మవారి శాల లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ కార్యక్రమం

పల్లె వెలుగు, రుద్రవరం; మండల కేంద్రమైన రుద్రవరంలో ని అమ్మవారి శాల లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ మహోత్సవం కనులవిందుగా శనివారం  నిర్వహించారు. స్వస్తి స్త్రీ శార్వరి నామ సంవత్సరం మాఘ శుద్ధ విదియ శనివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ చేసిన రోజు కావడంతో గ్రామంలోని అమ్మవారి శాల నందు ఆర్యవైశ్య మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమంలో పాల్గొన గా పూజారులు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి కి పంచామృత అభిషేకం కుంకుమార్చన అగ్నిగుండ ప్రవేశం మహా మంగళహారతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

About Author