PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కప్పట్రాళ్లలో ‘పోలింగ్​’ను పరిశీలించిన కలెక్టర్​

1 min read
కప్పట్రాళ్ల పోలింగ్​ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్​, ఎస్పీ

కప్పట్రాళ్ల పోలింగ్​ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్​, ఎస్పీ

పల్లెవెలుగు, దేవనకొండ ;
జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం అత్యంత సమస్యాత్మక గ్రామమైన కప్పట్రాళ్ళ గ్రామ పోలింగ్ కేంద్రం జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్​ జి. వీరపాండియన్​, ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప పరిశీలించారు. నాల్గవ విడత ఎన్నికల జరుగుతున్న సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద చేసిన భద్రతా ఏర్పాట్లను , ఎన్నికల పోలీంగ్ సరళిని , ఓటర్ల క్యూ లైన్ ను పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారి వెంట డోన్ డిఎస్పీ నరసింహా రెడ్డి, దేవనకొండ ఎమ్ ఆర్ ఓ శ్రీమతి ఇంద్రాణి, ఎమ్ పి డి ఓ ఆదయ్య, పత్తికొండ రూరల్ సిఐ డి.వి నారాయణ రెడ్డి, ఫ్యాక్షన్ జోన్ సిఐ రమణ, నంద్యాల రూరల్ సిఐ మల్లికార్జున, దేవనకొండ ఎస్సై నరసింహులు ఉన్నారు.

About Author