కర్నూలులో అభివృద్ధి లేదు..
1 min readపల్లెవెలుగు, కర్నూలు
వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా.. అభివృద్ధి ఎక్కడా జరగలేదని టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. శుక్రవారం ఆయన మౌర్య ఇన్‌లో కార్పోరేటర్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలు మాత్రమే ప్రజలకు అందుతున్నాయని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు వివరించి చెప్పి ఓట్లు అడగాలని చెప్పారు. అన్ని పదవులు అధికార పార్టీకి ఇస్తే అభివృద్ధి ఏమీ ఉండదన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధిపై ప్రశ్నించే టిడిపికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు సూచించారు. ఇక వార్డుల్లో కార్పోరేటర్ అభ్యర్థులు, ముఖ్య నాయకులు కష్టపడి పనిచేసి విజయం సాధించాలని చెప్పారు. సమయం తక్కువగా ఉన్నందున గ్రౌండ్ వర్క్ బాగా చేయాలని చెప్పారు. కొందరు అపోజిషన్ పార్టీ నాయకులు తమ పార్టీ ముఖ్యనాయకులు, కార్పోరేటర్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఫోన్లు చేసి ప్రలోభాలు, బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలా చేయడం అన్యాయమన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలు ఉన్నారని చెప్పడానికి పంచాయతీ ఎన్నికలే నిదర్శనమన్నారు. కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా సత్తాచాటుతామన్నారు.