NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలులో.. పూరిజగన్నాథ ఆలయం

1 min read
ఆలయాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ టీజీ వెంకటేష్​

ఆలయాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ టీజీ వెంకటేష్​

– భవనాన్ని ప్రారంభించిన ఎంపీ టీ.జీ. వెంకటేష్​
పల్లెవెలుగు, కర్నూలు
న‌గ‌రంలోని వెంక‌టేష్ థియేట‌ర్ ఆవ‌ర‌ణంలోని భ‌గీర‌థ కాంప్లెక్స్‌లో నూత‌నంగా నిర్మించిన‌ పూరిజ‌గ‌న్నాథ మందిరం భవనాన్ని రాజ్యసభ సభ్యులు టి.జి. వెంకటేష్​, టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్​చార్జ్​ టీజీ భరత్​ గురువారం ప్రారంభించారు. అంత‌ర్జాతీయ కృష్ణ చైరత‌న్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో 2012 సంవ‌త్సరం నుంచి క‌ర్నూలులో హ‌రే కృష్ణ ఉత్సవాలు, రథయాత్రలు జ‌రుగుతున్నాయ‌ని ఈ సంద‌ర్బంగా టి.జి భ‌ర‌త్ గుర్తు చేశారు. ప్రజలకు ఆధ్యాత్మిక‌త‌ను అందించేందుకు త‌మ వంతుగా ఎప్పుడూ కృషి చేస్తూనే ఉన్నామ‌న్నారు. పూరిజ‌గ‌న్నాథ మందిరానికి త‌మ స‌హ‌కారం ఎప్పుడూ ఉంటుంద‌న్నారు. అనంత‌రం నిర్వాహ‌కులు వైష్ణవ కృపదాస్‌ మాట్లాడుతూ నెల‌కు రూ. ల‌క్ష విలువ చేసే భ‌వ‌నాన్ని పూరిజ‌గ‌న్నాథ మందిరానికి ఎంపీ టి.జి వెంక‌టేష్ కుటుంబం ఉచితంగా ఇచ్చార‌ని తెలిపారు. అంతేకాకుండా గ‌తంలో మందిర నిర్మాణంలో భాగంగా రూ. 5 ల‌క్షలు విరాళంగా అందజేసిన‌ట్లు వివ‌రించారు. ‌త‌మ‌కు అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తున్న టి.జి వెంక‌టేష్ కుటుంబానికి కృత‌జ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క‌ర్నూల్ ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షులు, తిరుప‌తి ఇస్కాన్ టెంపుల్ ఉపాధ్యక్షుడు రూపేశ్వర చేతన్​ దాస్​ ప్రభు, న‌ర‌స‌రావు పేట ఇస్కాన్ టెంపుల్ ఉపాధ్యక్షులు చక్రధర్​ గోవింద దాస్ ప్రభు, భ‌క్తులు పాల్గొన్నారు. పూరిజ‌గ‌న్నాథ మందిరం ప్రారంభం అనంత‌రం హ‌రినామ సంకీర్తనలు నిర్వహించారు.

About Author