NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘కార్పోరేష‌న్’లో టీడీపీ గెలిస్తేనే.. అభివృద్ధి

1 min read
కార్యకర్తలతో టీజీ భరత్​

కార్యకర్తలతో టీజీ భరత్​

పార్టీలో కష్టపడే వారికే గుర్తింపు..
– కర్నూలు నియోజకవర్గ ఇన్​చార్జ్​ టీజీ భరత్​

పల్లెవెలుగు, కర్నూలు
క‌ర్నూలు న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి జ‌రుగుతుంద‌ని క‌ర్నూలు నియోజక‌వ‌ర్గ టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్ అన్నారు. శ‌నివారం మౌర్య ఇన్‌లో 18, 22, 23, 24, 25 వార్డుల‌కు సంబంధించిన కార్పోరేట‌ర్‌గా పోటీ చేస్తున్న అభ్య‌ర్థులు, ముఖ్య నాయ‌కుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో ఎలా ముందుకు వెళ్లాల‌న్న దానిపై చ‌ర్చించారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ అధికార పార్టీకి ఓటు వేస్తే ప్రశ్నించే వారు లేర‌న్న ధీమాతో అభివృద్ధి కుంటుప‌డుతుంద‌న్నారు. అందుకే కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులు ఖచ్చితంగా విజ‌యం సాధించాల‌న్నారు. ఈ విష‌యాన్ని ప్రజల్లోకి బ‌లంగా తీసుకెళ్లాల‌ని సూచించారు. ఈ రెండు సంవ‌త్సరాల్లో క‌ర్నూలు అభివృద్ధి ఎలా ఉందో అంద‌రికీ తెలుస‌న్నారు. వార్డుల్లో బాగా క‌ష్టపడి ప‌నిచేసే వారినే అభ్యర్థులుగా ఎంపిక చేశామ‌ని.. వారి గెలుపునకు అంద‌రూ క‌లిసిక‌ట్టుగా కృషి చేయాల‌ని చెప్పారు. ఇక టీడీపీ ఎలా పుంజుకుందో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో విజ‌యాలే నిదర్శన‌మ‌న్నారు. ఇదే జోరును కొన‌సాగించాల‌న్నారు. ప్రజలు స్వచ్ఛందంగా టిడిపికి ఓటు వేస్తున్నార‌న్నారు.

About Author