కేడీసీసీబీ చైర్మన్గా ఇన్ఛార్జ్ జేసీ (డీ)
1 min read
బాధ్యతలు స్వీకరిస్తున్న ఇన్చార్జ్ జేసీ(డీ) రాం సుందర్ రెడ్డి
పల్లెవెలుగు, కర్నూలు
కర్నూలు కేడీసీసీబీ చైర్మన్గా ఇన్చార్జ్ జేసీ ( రెవెన్యూ, అభివృద్ధి) ఎస్. రామసుందర్ రెడ్డి శనివారం రాత్రి కలెక్టర్లోని తన ఛాంబరులో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కేడీసీసీబీ చైర్మన్ పదవీకాలం ముగిసినందున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. డీసీఓ ఎన్.రామాంజనేయులు, కెడీసీసీబీ సీఈఓ పి.రామాంజనేయులు తదితరులు జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.