PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోడి మెడ‌కు మ‌ర్డర్ కేసు

1 min read

అవును.. మీరు వింటున్నది నిజ‌మే. కోడి మెడ‌కు హ‌త్యకేసు చుట్టుకుంది. ఓ వ్యక్తి చావుకు కోడి కార‌ణ‌మైంది. పోలీసులు కోడిని క‌స్టడీకి తీసుకున్నారు. అత‌ని చావుకు కార‌ణం ఆ కోడే అంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి…అరెస్టు చేసి..పోలీస్టేష‌న్లో క‌ట్టేశారు. విన‌డానికి వింత‌గా ఉన్న ఇది నిజం. అస‌లు ఈ ఘ‌ట‌న ఎక్కడ జ‌రిగిందో ఓ లుక్కేయండి.
జ‌గిత్యాల జిల్లా వెల‌గ‌టూరు మండ‌లం కొండాపూర్ కు చెందిన స‌తీష్ కోడి పందేలు నిర్వహిస్తుంటాడు. ఎప్పటిలాగే కోడి పందేనికి వెళ్లాడు. కోడికి క‌త్తి క‌ట్టి బ‌రిలోకి దింపే స‌మ‌యంలో.. క‌త్తి క‌ట్టిన కాలు కాకుండా… మ‌రో కాలును ప‌ట్టుకున్నాడు. అయితే.. కోడి స‌తీష్ నుంచి త‌ప్పించుకునే క్రమంలో కోడి క‌త్తి కాలుతో పొట్టలోకి త‌న్నింది. దీంతో స‌తీష్ తీవ్రగాయాల‌పాల‌య్యాడు. ఆస్పత్రికి త‌ర‌లించే క్రమంలో మార్గం మ‌ధ్యలో మ‌ర‌ణించాడు. దీంతో పోలీసులు కోడి మీద కేసు న‌మోదు చేశారు. త్వర‌లో కోర్టుకు కూడ హాజ‌రుప‌రుస్తారు. కోడి తో పాటు కోడి పందెం రాయుళ్లును కూడ అరెస్టు చేశార‌ట‌.

About Author