NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్షతగాత్రులకు పరామర్శ

1 min read
క్షతగాత్రులను పరామర్శిస్తున్న హసీనాబేగం

క్షతగాత్రులను పరామర్శిస్తున్న హసీనాబేగం

– మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన ఎన్​డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం
పల్లెవెలుగు, కర్నూలు హాస్పిటల్​
జిల్లాలోని వెల్దుర్తి మండలం మదార్​పురం వద్ద జాతీయ రహదారి 44పై ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. చిత్తూరు, కడప జిల్లా మదనపల్లి కి చెందిన రెండు కుటుంబాలు అజ్మీర్ దైవదర్శనానికి బెంగళూరు వైపునుండి హైదరాబాద్ వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొనడంతో రెండు కుటుంబాలకు చెందిన 14 మంది ఘటనా స్థలంలోనే చనిపోవడం మిగతా వారిని కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కర్నూలు జిల్లా నేషనల్ ఉమెన్​స పార్టీ జిల్లా అధ్యక్షురాలు హసీనా బేగం , జిల్లా వింగ్ ప్రెసిడెంట్ ఎన్. మేరీ , జనరల్ సెక్రటరీ కృష్ణవేణి మరియు నేషనల్ ఉమెన్స్ పార్టీ వాల్ ఎంట్రీలు సిమ్రాన్, అనిత పరామర్శించారు. రాష్ర్ట ప్రభుత్వం వెంటనే చనిపోయిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్​గ్రేషియా చెల్లించాలని కోరారు.

About Author