కరోన మళ్లీ దాడి చేయనుందా?
1 min readఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 24 గంటల్లో 17 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దేశ వ్యాప్తంగా మరోసారి కరోన దాడి చేస్తుందా? అన్న సందేహం అందరిలోను మొదలైంది. కొత్తగా 89 మంది కరోన బారిన పడి మరణించగా.. ఇప్పటి వరకు మొత్తం 1,57000 మంది మరణించారు. మరోవైపు వ్యాక్సిన్ పంపణీ కూడ దేశవ్యాప్తంగా వేగవంతంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు దశల వ్యాక్సిన్ పంపిణీ పూర్తవ్వగా.. మూడో దశ పంపిణీకి ప్రభుత్వం సిద్దమవుతోంది. వ్యాక్సిన్ కోసం రద్దీ పెరగడంతో… 24 గంటలూ వ్యాక్సిన్ అందుబాటులో ఉండేట్టు కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది.