జీజీహెచ్‌కు పునర్వైభవం..
1 min read110 అంజియోగ్రామ్ మరియు స్టెంట్స్ ఆపరేషన్లు విజయవంతం
– అడిషనల్ డీఎంఈ , గుండె జబ్బుల విభాగాధిపతి డా.పి.చంద్రశేఖర్
పల్లెవెలుగు, కర్నూలు హాస్పిటల్
మెరుగైన వైద్య చికిత్సలు అందించడంలో రాష్ర్టస్థాయిలో గుర్తింపు ఉన్న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు పునర్వైభవం తీసుకొచ్చామని అడిషనల్ డీఎంఈ , గుండె జబ్బుల విభాగాధిపతి డా.పి.చంద్రశేఖర్ అన్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఆస్ప్రతిలోని గుండెజబ్బుల విభాగంలో అంజియోగ్రామ్ మరియు స్టెంట్స్ ఆపరేషన్లను కొన్ని రోజులుగా నిలిపివేశామన్న డా. పి. చంద్రశేఖర్… నెల రోజుల్లోపు 85 అంజియోగ్రామ్ ఆపరేషన్లు, 22 స్టెంట్స్ తోపాటు మరో మూడు చిన్నచిన్న ఆపరేషన్లను సిబ్బంది, వైద్యుల సహకారంతో విజయవంతం చేశామన్నారు. . ఈ సందర్భంగా శనివారం గుండెజబ్బుల విభాగంలో కేక్ కట్ చేసి .. సిబ్బంది, డాక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్య్రకమంలో హెడ్ నర్స్ వసంత, స్టాఫ్ నర్సులు సలోమి, కళ్యాణి, డాక్టర్ శశి వర్ధన్, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి , డాక్టర్ వినోద్, డాక్టర్ శివకృష్ణ మరియు పారామెడికల్ సిబ్బంది శివ, రమేష్, తదితరులు పాల్గొన్నారు.