NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జీవకోటికి.. జీవనాధారం..

1 min read
సూర్యదేవుడికి క్షీరాభిషేకం చేస్తున్న శ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ

సూర్యదేవుడికి క్షీరాభిషేకం చేస్తున్న శ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ

– సూర్యభగవానుడి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉండండి
– శ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ
– వేలాదిగా తరలివచ్చిన భక్తులు
– స్వామివారిని దర్శించుకున్న పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి,
టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ టీజీ భరత్

పల్లెవెలుగు,కర్నూలు
సకలజీవ కోటికి.. జీవనాధారం.. సూర్యభగవానుడేనని, ఆయన వల్లే నిత్యం నవచైతన్యం… ఆరోగ్యం.. సుఖసంతోషాలతో ఉన్నామని శ్రీశ్రీ దత్త విజయానంద తీర్థస్వామిజీ అన్నారు. నగరంలోని శ్రీ దత్తస్వామి సూర్య దేవాయంలో శుక్రవారం రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీశ్రీ దత్త విజయానంద తీర్థస్వామిజీ ఉదయం నుంచి సూర్య దేవుడికి అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం స్వామిజీ భక్తులకు ప్రవచనాలు బోధించారు. సూర్యదేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాని, ప్రతిరోజు సూర్యుడిని పూజించాన్నారు. అంతకు ముందు పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి సతీమణి విజయమనోహరమ్మ, టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ టీజీ భరత్‌ సూర్యభగవానుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీశ్రీ దత్త విజయానంద తీర్థస్వామిజీ ఆశీస్సులు పొందారు. రథసప్తమి వేడుకలకు భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టు చైర్మన్ రామకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author