టీడీపీని వీడే ప్రసక్తే లేదు
1 min read
మాట్లాడుతున్న టీజీ భరత్
– వదంతులు నమ్మవద్దు
– కార్యకర్తలకు, నాయకులకు సూచించిన టీజీ భరత్
పల్లెవెలుగు, కర్నూలు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో … తాను టీడీపీ వీడుతానని కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీ వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం టీజీ భరత్ విలేకరులతో మాట్లాడుతూ కర్నూలులో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు, నాయకుల మనోధైర్యం దెబ్బతీసేందుకు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని టి.జి భరత్ స్పష్టం చేశారు. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఇలాంటి వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.