పోలింగ్ కేంద్రాల వద్ద సదుపాయాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోండి
1 min read- ఎన్నికల జనరల్ అబ్జర్వర్ MMనాయక్
బనగానపల్లె :
పోలింగ్ కేంద్రాల వద్ద సదుపాయాలు సక్రమంగా ఉండేలా చర్యలు చేపట్టాలని
ఎన్నికల జనరల్ అబ్జర్వర్ MMనాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు
అనంతరం ఎన్నికల జనరల్ అబ్జర్వర్ MM నాయక్ మాట్లాడుతూ బనగానపల్లె మండలంలోని ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత అధికారులతో కలిసి తెలుసుకున్నారు బనగానపల్లె మండలం లో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎన్ని వార్డులు ఉన్నాయి మండలములో రెండు వేల లోపు జనాభా కలిగిన గ్రామపంచాయతీలు ఎన్ని ఉన్నాయ్ అని రెండు వేల నుంచి ఐదు వేలు జనాభా కలిగిన గ్రామపంచాయతీలుఎన్ని ఉన్నాయి ఐదు వేల పైన జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి ఈ గ్రామపంచాయతీలలో సమస్యాత్మక గ్రామ పంచాయతీ లు ఎన్ని అతి సమస్యాత్మకమైన గ్రామ పంచాయతీ లు ఎన్ని అలాంటి పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి చర్యలు చేపట్టారని అడిగి తెలుసుకున్నారు పోలింగ్ అనంతరం జరిగే ఓట్ల లెక్కింపు లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయించాలని నిరంతరం కరెంటు ఉండేలా చర్యలు గైకొనాలి అని అవసరమున్న చోట జనరేటర్ ఉపయోగించాలని అధికారులకు సూచించారు నామినేషన్ల ఉపసంహరణ బలవంతపు ఉపసంహరణలు ఉండకుండా చూడాలని అలాంటి సమస్యలుంటే మా దృష్టికి తీసుకురావాలన్నారు ఓటర్లు ఓటు హక్కు వినియోగించే సమయంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని జనాభా ఎక్కువ గా ఉన్న ప్రాంతంలో బ్యార్గెట్ లు నిర్మించాలని ఓటరు స్వేచ్ఛ హితంగ ఓటు వినియోగించుకోనేల చర్యలు గైకొనాలి అన్నారు సమస్యాత్మకంగా అతి సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ స్టేషన్ వద్ద పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు గైకొనాలి అని అధికారులకు సూచించారు
ఆదివారం బనగానపల్లె మండల కేంద్రంలో మండల పరిషత్ సమీక్షా సమావేశభవనం లో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ ఎం ఎం నాయక్ బనగానపల్లె తహసీల్దార్ ఆల్ఫ్రెడ్ మండల పరిషత్ అధికారి నాగ ప్రసాద్ EORD శివరామయ్య లతో కలిసి సమీక్ష నిర్వహించారు