పోలీసు కుటుంబానికి భద్రత చెక్కు అందజేత
1 min readపల్లెవెలుగు, కర్నూలు
జిల్లా పోలీసు శాఖలో పని చేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన బాధిత పోలీసు కుటుంబానికి ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం భద్రత చెక్కును అందజేశారు. 1996 బ్యాచ్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కె. పాములేటి ( హెచ్.సి 614) నంద్యాల ఒకటవ పోలీసుస్టేషన్ లో పనిచేస్తూ అక్టోబర్ 06 వ తేది 2020 సంవత్సరంలో అనారోగ్యం మృతి చెందారు. భద్రత ఫండ్ క్రింద వచ్చిన చెక్కును హెడ్ కానిస్టేబుల్ భార్య కె. జ్యోతి గారికి రూ. 3 లక్షల 64 వేల 129 లు భద్రత చెక్కును జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపిఓ ఎ ఓ శ్రీ సురేష్ బాబు, ఎస్పీ గారి పి ఎ శ్రీ నాగరాజు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీ నాగరాజు ఉన్నారు.