ప్రణాళికబద్ధంగా చదవండి..
1 min read– రోగిని దేవుడిగా భావించండి..
– గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత
– ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం రిటైర్డు వైస్ ఛాన్సలర్ డా.పి. శ్యామ్ ప్రసాద్
పల్లెవెలుగు, కర్నూలు హాస్పిటల్
వైద్యవృత్తిని.. రోగిని దైవంగా భావించాలని, అప్పుడే న్యాయం చేయగలమని ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం రిటైర్డు వైస్ ఛాన్సలర్ డా.పి. శ్యామ్ ప్రసాద్ అన్నారు. విద్యార్థి దశలో ప్రణాళికబద్ధంగా చదివి… ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించిన ఆయన… గురువులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. శుక్రవారం కర్నూలు మెడికల్ కళాశాలలో కాలేజి ప్రిన్సిపల్ జిక్కి నేతృత్వంలో ఫ్రెషర్స్ డే – ఉత్కర్శ 2021 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం రిటైర్డు వైస్ ఛాన్సలర్ డా.పి. శ్యామ్ ప్రసాద్,గౌరవ అతిథులుగా రిటైర్డ్ డి,యమ్.ఇ డా.వెంకటేష్,రిటైర్డ్ అడిషనల్ డి.య.మ్.ఇ డా.రామ చంద్రా రెడ్డి హాజరు కావడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం రిటైర్డు వైస్ ఛాన్సలర్ డా.పి. శ్యామ్ ప్రసాద్ వైద్యవిద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. వైద్య విద్యను ఇష్టం.. ప్రణాళికంగా చదవాలని, అప్పుడే ఉత్తీర్ణత సాధిస్తారన్నారు. వైధ్య విద్యార్థులు మానవ విలువలతో మెలగాలని, తల్లి తండ్రులను,గురువులను గౌరవించాలని రోగులను దేవతలుగా చూడాలని కోరారు. ఈ విధ్య జీవితంతాము ఉపయోగపడుతుందని అందువల్ల పునాది బలంగా వుండాలన్నారు. కార్యక్రములో సర్వజన వైధ్య శాల సూపరిండెంట్ డా. నరేంద్ర నాథ రెడ్డి , ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా.పి. చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు కాలేజ్ యందు క్రీ.స్తు పూర్వం 6000 వ శతాబ్దం కు చెందిన శస్త్ర చికిత్సకు ఆధ్యుడు శుశ్రుత విగ్రహాన్ని వారు ప్రారంభించారు. . ఈ విగ్రహాన్ని కార్డియాలజీ విబాగం వారు తమ సిబ్బంది ఇటీవల మృతి చెందిన స్టాఫ్ నర్స్ జి.షీబా రాణి జ్ఞాపకార్థం భర్త ఎలియా సహకారం తో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమము లో వైధ్య విద్యార్థులు చేసి సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించడం జరిగింది. ఈ సంస్కృతిక కార్యక్రమాలను బయో కెమిస్త్రీ ప్రొఫెసర్ డా. పద్మ విజయ శ్రీ, సర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. మాదవి శ్యామల, పథాలజీ ఆసిస్టంట్ ప్రొఫెసర్ డా. రేవతి సమన్వయంతో నిర్వహించారు.
జ్యోతిప్రజ్వలనగావిస్తున్న డా. శ్యామ్ ప్రసాద్