PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతిభా వంతులకు ఉద్యోగ మేళ

1 min read
అసిస్టెంట్​ డైరెక్టర్​ విజయ

అసిస్టెంట్​ డైరెక్టర్​ విజయ

24 వివిధ శాఖల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
– మార్చి 2 నుంచి 20వ తేదీలోపు దరఖాస్తులు కార్యాలయంలో సమర్పించాలి
– విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ విజయ
పల్లెవెలుగు, కర్నూలు
కర్నూలు జిల్లాలో వివిధ శాఖలలోని ఉద్యోగాల నియామకం కోసం అర్హులైన విభిన్న ప్రతిభావంతుల( వికలాంగులు) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్​ డైరెక్టర్​ విజయ తెలిపారు. సోమవారం ఆమె ఛాంబరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు మార్చి 2 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్​లైన్​లోదరఖాస్తు చేసుకున్న తరువాత.. 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. విద్యార్హత, మెరిట్​, వయస్సు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు.
డీఎస్సీ పరిధిలోని ఉద్యోగాల సంఖ్య (07)
సూపరింటెండెంట్​ ఇంజనీర్​, టీజీపీ సర్కిల్​, నంద్యాల (బధిరులు)​, జిల్లా పంచాయతీ కార్యాలయం (కర్నూలు) (శారీరక వికలాంగులు) జూనియర్​ అసిస్టెంట్​ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చని, అదేవిధంగా జిల్లా ఆడిట్​ కార్యాలయం , స్టేట్​ ఆడిట్​ (బధిరులు) జూనియర్​ ఆడిటర్​, సూపరింటెండెంట్​ ఇంజనీరు, పబ్లిక్​ హెల్త్​ సర్కిల్​, (అంధులు), డిప్యూటీ డైరెక్టరు, సెరికల్చర్​ ( అంధులు), జిల్లా మేనేజర్​, జిల్లా పరిశ్రమల సెంటర్​( అంధులు), ప్రొహిబిషన్​ అండ్​ ఎక్సైజ్​ ( అంధులు) టైపిస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏడీ విజయ వెల్లడించారు.
డీఎస్సీ పరిధిలోకి రాని ఉద్యోగాలు (17)
జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం, కర్నూలు( అంధులు) ల్యాబ్​ టెక్నిషియన్​కు ..
డబ్ల్యూడీఏఎస్​సీ​–ఎస్​ఆర్​డీఓబీఎల్​ 5(4) 2021– ఎస్​డీ( ఎస్​డీ)– డబ్ల్యూఏఎస్​డకే ఆర్​ఎన్​ఎల్​లో..
ఏడీ, హండ్​ల్యూమ్స్​ మరియు టెక్​టైల్స్​, కర్నూలు( అంధులు), జిల్లా పంచాయతీ (బధిరులు), కమిషనరు, కర్నూలు మున్సిపల్​ కార్పొరేషన్​ (బధిరులు), సూపరింటెండెంట్​ ఇంజనీరు, టీజీపీ సర్కిల్​ , నంద్యాల ( శారీరక వికలాంగులు) వారు కార్యాలయపు సబార్డినేట్​ / అటెండర్​ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా కమిషనరు, కర్నూలు ( అంధులు), కమిషనరు, ఆదోని మున్సిపాలిటీ (శారీరక వికలాంగులు) పీ.హెచ్​ వర్కర్​ పోస్టుకు,
కమిషనర్​, డోన్​ మున్సిపాలిటీ (అంధులు మరియు బధిరులు) పీహెచ్​ స్వీపర్​ పోస్టుకు, డివిజనల్​ ఫారెస్టు కార్యాలయం (డబ్ల్యూ ఎల్​) నంద్యాల డివిజన్​, డోన్​ మున్సిపాలిటీ (అంధులు) ఆఫీస్​ వాచర్​ పోస్టుకు, జిల్లా విద్యాశాఖ , కర్నూలు( అంధులు) స్వీపర్​, కమిషనరు , కర్నూలు మున్సిపాల్​ కార్పొరేషన్​( అంధులు) పార్కు మాలి, కమిషనరు కర్నూలు మున్సిపల్​ కార్పొరేషన్​ (అంధులు) మజ్దూరు పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏడీ విజయ వెల్లడించారు.
వివరాలకు www.kurnool.ap.gov.in ను సంప్రదించాలన్నారు.
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కర్నూలు,ఏపీ,జీఓవీ. సంప్రదించాలని సూచించారు.

About Author