PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రధాన కూడళ్లలో ఆకర్షణీయ బొమ్మల ఏర్పాటు

1 min read
కర్నూలు కలెక్టరేట్​, సీ క్యాంపు, నంద్యాల చెక్​ పోస్టు, కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన బొమ్మలు

కర్నూలు కలెక్టరేట్​, సీ క్యాంపు, నంద్యాల చెక్​ పోస్టు, కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన బొమ్మలు

కర్నూలు నగరంలోని ముఖ్య కూడళ్లలో సుందరికరణ పనుల్లో భాగంగా కర్నూలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వివిధ రకాల ఆకర్షణీయమైన బొమ్మలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద పులి బొమ్మను, రాజ్ విహర్ కూడలిలో జిరాఫీ, సి క్యాంప్ కూడలిలో తామర పువ్వు, నాగ శేషుడు, ఆర్.ఎస్.సర్కిల్ లో సంగీత పరికరమైన వీణ, నటరాజ కంపాస్ బాక్స్ ప్రతిమలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య కూడళ్లలో విగ్రహాల ఏర్పాటుకు జరుగుతున్న పనుల తీరును కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ పరిశీలించి పలు సూచనలు చెప్పారు. నగరంలో సుందరికరణ పనుల్లో భాగంగా రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రత్యేక కళాకారుల నుంచి వివిధ రకాల బొమ్మలను ఇప్పటికే ముఖ్య కూడళ్లల్లో ఏర్పాటు చేశామని… మరిన్ని అందమైన, ఆకర్షణీయమైన బొమ్మల ఏర్పాటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ బాలాజీ తెలిపారు. ఆయన వెంట నగర పాలక డిఈ ఆర్. రాజశేఖర్, ఏఈ హిమబిందు ఉన్నారు.


About Author