ప్లేటు బిర్యాని ఎంతో తెలుసా?
1 min readదుబాయ్;
సాధారణంగా మన దేశంలో బిర్యాని అంటే మక్కువ లేని నాన్ వెజ్ ప్రియులు ఉండరు. బిర్యాని పేరు విన్నా…కనపడినా నోరు ఆగదు. లొట్టలేసుకుంటూ మరీ తింటారు. అలాంటి బిర్యాని ధర మన దేశంలో ..మన రాష్ర్టంలో దాదాపు 50 రూపాయల నుంచి 200 వందల రూపాయల మధ్యలో ఉంటుంది. కానీ దుబాయ్ లోని ఓ రెస్టారెంట్ లో బిర్యాని ధర ఎంతో వింటే ముక్కున వేలేసుకుంటారు మనవాళ్లు. ఎందుకంటే ఆ ధర మాములుగా ఉండదు మరి. అక్షరాల 19,700 రూపాయలు. అవును మరీ… ఆ ధరకు తగ్గట్టే 23 కేరట్ల బంగారు ప్లేటులో ఆ బిర్యాని వడ్డిస్తారట. మామూలుగా అయితే మన బిర్యానిలో ఒకే రకమైన రైస్ సర్వ్ చేస్తారు. కానీ ఆ బిర్యానీ ప్లేటులో రకరకాల నాన్ వెజ్ రైస్ సర్వ్ చేస్తారట. అందుకే కాబోలు ఆ బిర్యానీకి అంత రేటు. ఏది ఏమైనా మన బిర్యాని రుచే రుచి. ధరకు ధర…రుచికి రుచి, అందరికి అందుబాటులోని పౌష్టికాహారం.