బాంబులతో రైలెక్కబోయిన మహిళ
1 min readకేరళ; లగేజీతో రైలెక్కడం చూశాం… చిన్న పిల్లలతో రైలెక్కడం చూశాం కానీ, బాంబులతో రైలెక్కడం ఏంటనుకుంటున్నారా?. అవును ఇది నిజం.. కేరళలోని కొజికోడ్ లో ఓ మహిళ అచ్చంగా 100 జిలెటిన్ స్టిక్స్ , 350 డిటోనేటర్లతో రైల్వే స్టేషన్ కు వచ్చారు. అయితే తనిఖీల్లో భాగంగా ఆమె ను ఆర్ఫీఎఫ్ సిబ్బంది తనిఖీ చేశారు. ఆమె వద్ద పేలుడు పదార్థాలు కనిపించడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సదరు మహిళను పోలీసులు ప్రశ్నించగా… కొండలు, గుట్టలు పేల్చేందుకు తీసుకెళ్తున్నానని సమాధానం ఇచ్చారట. ఇది నమ్మశక్యంగాలేదని నిర్ధారణకు వచ్చిన పోలీసులు .. ఈ ఘటన అన్నికోణాల్లో విచారిస్తున్నారు. త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు కూడ ఉండటంతో.. కేసును తీవ్రంగా పరిగణిస్తున్నారు.