బాధితురాలికి పరామర్శ
1 min readధైర్యంగా ఉండాలని సూచించిన ఎన్డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం
పల్లెవెలుగు, కర్నూలు
కర్నూలు జిల్లా వెలుగోడు మండలం వెల్పనురు గ్రామంలో అత్త, మామ, భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఇంట్లోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. చికిత్స నిమిత్తం ఆమెను బంధువులు కర్నూలు ప్రభుత్వ ఆస్ప్రతికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎన్డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్.హసీనాబేగం సోమవారం ప్రభుత్వ ఆస్ప్రతిలో చికిత్సపొందుతున్న బాధితురాలిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్.హసీనాబేగం మాట్లాడుతూ బాధితురాలికి అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. వివాహితను వేధింపులకు గురి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఎన్డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు…బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని ఆస్ప్రతి వైద్యులను కోరారు. కార్యక్రమంలో పార్టీ వింగ్ ప్రెసిడెంట్ మెరీ, వాలంటీర్స్ సిమ్రాను,అనిత మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.