PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాగు చేసిన కర్బూజా, కలింగర పండ్లు వద్ద రైతు అశోక్​

సాగు చేసిన కర్బూజా, కలింగర పండ్లు వద్ద రైతు అశోక్​

ప్రకృతి వ్యవసాయం.. పండ్ల సాగులో మేటి..
– విదేశాలలో మంచి గిరాకి…
పల్లెవెలుగు, రుద్రవరం; ప్రకృతి వ్యవసాయంతో సాగుచేసిన పండ్లకు విదేశాలలో మంచి గిరాకీ పలుకుతోంది. రైతులు అధిక శాతం రసాయనిక ఎరువులతో పండ్ల తోటలు సాగు చేయడం వలన దిగుబడి తగ్గి పోవడమే కాకుండా రైతులు ధర లేక కొనేవారు లేక విలవిల్లాడుతూ నష్టాల పాలవుతున్న పరిస్థితులు అనేకం ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయం తో సాగుచేసిన పండ్లతోటలకు మన దేశంతో పాటు విదేశాలలో మంచి గిరాకి ఉండడం తెలుసుకున్న  మండలంలోని ఆలమూరు గ్రామానికి చెందిన అశోక్ అనే రైతు ప్రకృతి వ్యవసాయం మీద ఆధారపడి పళ్ళ తోట సాగుచేశాడు. శుక్రవారం వ్యవసాయ శాఖ ఏడి ఎ వరప్రసాద్ తో పాటు ఐఆర్ టిఎ సుధాకర్ తో పాటు పలువురు రైతు సాగు చేసిన కర్బూజ కలింగర పంటను పరిశీలించి రైతులకు తగిన సలహాలు సూచనలు వివరించారు. మండలంలోని ఆలమూరు గ్రామానికి చెందిన అశోక్ అనే రైతు ప్రకృతి వ్యవసాయం పై ఐ ఆర్ టిఏ సుధాకర్ ఇచ్చిన సలహాలు సూచనల మేరకు నాలుగు ఎకరాల్లో కర్బూజా, కలింగర రకాలకు చెందిన కోహినూరు, బాబి అలాగే జినత్, కిరణ్ అనే రకాలను మల్చింగ్ పేపరు పద్ధతుల్లో తైవాన్ సీటు రకాలను తెచ్చి సాగు చేశాడు. సాగుభూమిలో 130 కేజీల పొగాకు పొడి ఆముదం చెక్క వేప చెక్క శనక్కాయల చెక్క పంటకు ముందు భూమిలో వేశాడు. రాకుండా పంటలు దోమ ఆశించకుండా పంటపై వలలు ఏర్పాటు చేశాడు. పంట సాగు చేసిన తర్వాత దోమపోటు రాకుండా బ్రహ్మాస్త్రం నీమాస్త్రం దశపరని కషాయాలను వాడడం జరిగిందని రైతు తెలిపారు. పంట గ్రోత్ రావడం కోసం పంచగవ్వ పుల్లటి మజ్జిగ జీవామృతం వాడడం జరిగింది అని రైతు తెలిపారు. వీటిని పండ్లతోటలకు వాడడం వలన పైరు ఇమిటేషన్ పవర్ పెరిగి తెగుళ్ళను పురుగులు రాకుండా తట్టుకుని పంట దిగుబడి మంచి రుచి నాణ్యత అధిక కాలం నిల్వ ఉండడం జరుగుతుందన్నారు. ఇక్కడ పండించిన పండ్ల శాంపిల్స్ సేకరించి బొంబాయిలోని ల్యాబ్ కు తరలించి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ పండ్లు వాడడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అని శాస్త్రవేత్తలు నిర్ధారించడంతో ఈ పండ్లకు విదేశాలలో లో మంచి ధర ఉండటంతో రైతులు విదేశాలకు తరలించేందుకు మొగ్గు చూపుతున్నారు. మన ప్రాంతంలో రసాయనిక ఎరువులతో పండించిన పండ్లకు ధర కేజీ పది రూపాయలు మాత్రమే ఉందని ప్రకృతి వ్యవసాయం తో పండించిన పండ్లకు కేజీ ధర 20 రూపాయలు ఉండడంతో తాను ప్రకృతి వ్యవసాయం తో నాలుగు ఎకరాల లో మూడు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి కర్బుజా కలింగర  రకాల పండ్ల పెంపకం సాగు చేశానని దీంతో అధిక దిగుబడి వచ్చిందని నాలుగు ఎకరాలకు 40 టన్నులు పంట దిగుబడి రాగా నా లక్ష రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ఇంకా పండ్ల కోతలు కోసే అవకాశం ఉందన్నారు. ఈ పకృతి వ్యవసాయంతో పండ్లతోటలు పండించడం వలన అధిక దిగుబడి సాధించడమే కాకుండా విదేశాల్లో మంచి ధర ఉంటుందని దీంతో రైతులు లాభసాటి సాధించవచ్చని వ్యవసాయ అధికారులు పలువురు రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది రైతులు తదితరులు ఉన్నారు.

About Author