భారత్… ప్రపంచదేశాలకు ఆదర్శం..
1 min readపూజ్య పాద శ్రీశ్రీశ్రీ విరజానంద స్వామీజీ
పల్లెవెలుగు, కర్నూలు
నమస్కార.. సంస్కారాన్ని ప్రపంచ దేశాలు ఆచరించాయని, అందుకే కరోనా బారి నుంచి గట్టెక్కాయని పూజ్య పాద శ్రీశ్రీశ్రీ విరజానంద స్వామీజీ అన్నారు. సూర్యనమస్కారాలు, యోగా, ధ్యానంతో మనుషులు ఆరోగ్యంగా జీవించవచ్చని పేర్కొన్న స్వామిజీ… కష్టజీవుల వెంట సూర్యుని ప్రభావం నిరంతరం ఉంటుందన్నారు. శుక్రవారం రథసప్తమిని పురస్కరించుకుని నగరంలోని ఇండస్ పాఠశాలలో తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సూర్యనమస్కారాలు, యోగా తదితర కార్యక్రమాలు నిరర్వహించారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ సూర్య భగవంతుడి లీలలు వర్ణించలేమని, , ప్రకృతిలో విపత్తులు జరిగినప్పుడే ఇటువంటి పంచభూతాల శక్తులు ప్రపంచానికి తెలియవస్తాయన్నారు. కష్ట జీవులు, నిరంతరం ప్రకృతితో మమైకమైన కష్టజీవులు ఎలాంటి వ్యాధి గ్రస్తులు కారని, అందుకు కారణం సూర్యుని ప్రభావమేనన్నారు. ప్రపంచదేశాలన్నింటికీ కరోనా వ్యాక్సిన్ ప్రధమంగా అందచేసిన ఘనత భారతదేశానిదేనని, ఇటువంటి దేశానికి భావి భారత పౌరులుగా మిమ్మల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి ,పాఠశాల మేనేజర్ విల్సన్, ప్రధానాచార్యులు బి.యం.మీనాక్షి, సి.బి.ఎఎస్.సి.ప్రిన్సిపాల్ కె.శ్రీనీవాస రెడ్డి, యోగా మాస్టర్ శ్రీనివాస్, వాసు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.