మతం ముసుగులో మోసం..
1 min readపల్లె వెలుగు , గడివేముల;
అమాయక ప్రజలే లక్ష్యంగా చేసుకున్న మోసగాళ్లు… తమ టార్గెట్ను సులువుగా పూర్తి చేసుకుని… ఆ తరువాత అక్కడ నుంచి ఉడాయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ర్టంలో అక్కడక్కడ జరుగుతున్నా… ప్రజల్లో చైతన్యం రాకపోవడం… దురదృష్టకరం. చీరలు..బీరువాలు.. సెల్ఫోన్లు ఉచితంగా ఇచ్చి… ఆపై ఇంటి స్థలాలు, విదేశాల నుంచి రుణాలు ఇప్పిస్తానని.. దాదాపు 20 మందితో ఒక్కొక్కరితో రూ.5 లక్షలు చొప్పున వసూలు చేసుకుని.. పరారీ అయ్యాడు. మోసపోయిన విషయం.. ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు.. మోసగాడిని పట్టుకుని.. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. మోసగాడిపై కేసు నమోదు చేశారు. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి . బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పెద్ద మౌలాలి.. కరిమద్దెల గ్రామంలో వారంలో రెండుమూడు సభలు, మత ప్రచారం సమావేశాలు నిర్వహించాడు. సభకు.. సమావేశాలకు వచ్చిన ప్రజలను నమ్మించి.. వారితో డబ్బులు, బంగారం వసూలు చేశాడు. ఆ తరువాత అమాయక ప్రజలకు సెల్ఫోన్లు, బీరువాలు, చీరలు ఉచితంగా ఇచ్చి నమ్మించాడు. ఇంటి స్థలాలు ఇప్పిస్తానని,విదేశీయుల నుంచి రుణాలు ఇప్పిస్తానని చెప్పి… 20 మందితో ఒక్కొక్కరితో రూ.5 లక్షలు చొప్పున వసూలు చేశాడు. ఆ తరువాత కొన్ని రోజులుగా మోసగాడు కనిపించకపోవడంతో… అనుమానం వచ్చిన ప్రజలు మతప్రచారకుడిపై ఆరా తీశారు. మోసగాడిని పట్టుకుని.. మండల కేంద్రమైన గడివేముల పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుబ్బరామిరెడ్డి తెలిపారు. మోసగాడిపై ఇతర పోలీస్ స్టేషన్లలో పలు ఫిర్యాదులు ఉన్నట్లు ఎస్ఐ వివరించారు.