ముందస్తు.. ఏర్పాట్లు
1 min readఎన్నికల సామగ్రిని సిద్ధం చేస్తున్న అధికారులు
పల్లెవెలుగు, కర్నూలు
ఈ నెల 10న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. స్థానిక పాత పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద దామోదరం సంజీవయ్య స్మారక నగర పాలక పాఠశాలలో….. నగరంలోని మొత్తం 380 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన ఎన్నికల సామగ్రిని పోలీస్ బండిబస్తుతో భద్రపరిచారు. సోమవారం ఉదయం ఎన్నికల సామాగ్రిని నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ, అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్ పరిశీలించడం జరిగింది. ఇప్పటికే మునిసిపల్ అధికారులు ఎన్నికల ఆర్వోల వారీగా ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి అవసరమయ్యే వస్తువులను సిద్ధం చేసి ఉంచారు. త్వరలోనే వీటిని పంపిణీ కేంద్రానికి తరలించేందుకు కూడా అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఈ నేపథ్యంలో ప్యాక్ చేసిన వాటిలో ఒక సంచి తీసుకుని చెక్ లిస్ట్ దగ్గర ఉంచుకుని వాటిలో ఉంచిన ఒక్కొక్క వస్తువులను క్రమపద్ధతిలో ఉన్నాయా..లేదా అని కమిషనర్ బాలాజీ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ బాలాజీ మాట్లాడుతూ…ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసే క్రమంలో అదనంగా 20 శాతం సామగ్రి సిద్ధం ఉంచుకోవాలని, ప్రిసైడింగ్ అధికారులకు ఏదేనా అవసరమై అడిగిన వెంటనే వారికి అందజేసేలా ఉండాలని సూచించారు. నగర పాలక మేనేజర్ చిన్న రాముడు, మున్సిపల్ ఎన్నికల విభాగం సుపరింటెండెంట్ ఇశ్రాయేల్, మునిసిపల్ ఆర్.ఐలు శ్రీకాంత్, సుహెల్, రాజు తదితరులు ఉన్నారు.