మూడవరోజు రాహుల్ గాంధీ జూడో యాత్ర.. ఏపీ
1 min read
పల్లె వెలుగు వెబ్ కర్నూలు: ఏపీలో మూడవరోజు రాహుల్ గాంధీ జూడో యాత్ర ప్రారంభమైంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి నుంచి యాత్ర ప్రారంభించారు. యం ముగతి గ్రామం వరకు ఈ యాత్ర సాగనుంది. అనంతరం.. కొంత విరామం తర్వాత.. తిరిగి సాయంత్రం 4 గంటలకు హాలహర్వి నుంచి యాత్ర ప్రారంభం కానుంది. ఇక.. సాయంత్రం ఆరున్నర గంటలకు కల్లుదేవకుంటలో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు రాహుల్. రాత్రికి మంత్రాలయం మండలం చెట్నిహళ్లిలో రాహుల్ బస చేయనున్నారు. పాదయాత్ర అనంతరం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోనున్నారు రాహుల్ గాంధీ.ఇదిలా ఉంటే.. రాహుల్ భారత్ జోడోయాత్రలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మిగనూరుకు 10కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపివేయడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు, ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
